ManaEnadu:‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ టీజర్‌ను దీపావళికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ టీజర్ కోసం మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముందుగా దసరా కానుకగా టీజర్‌ను విడుదల చేద్దామని చిత్ర యూనిట్ భావించింది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు దీపావళి కానుకగా ఈ టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు శంకర్ తన గత చిత్రం ‘భారతీయుడు2’ అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై ఆయన రెట్టింపు ఫోకస్ పెట్టే ఛాన్సుంది. అటు భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…






