జైలు నుంచి విడుదలైన కన్నడ నటుడు దర్శన్

Mana Enadu : అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో (Renukaswamy murder case) అరెస్టయి జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ (Actor Darshan) ఇవాళ (అక్టోబర్ 30వ తేదీ) జైలు నుంచి బయటకు వచ్చారు.  కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయగా.. దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

బెయిల్ పిటిషన్ తిరస్కరించిన బెంగళూరు కోర్టు

పవిత్ర గౌడ (Pavitra Gowda)కు రేణుకా స్వామి అసభ్యకర ఫొటోలు, సందేశాలు పంపించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని  దర్శన్‌ అండ్ కో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే అరెస్టయిన వీరంతా  బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో దర్శన్ తో పాటు పవిత్ర కూడా బెయిల్ కోసం బెంగళూరు కోర్టు(Bengaluru Court)ను ఆశ్రయించారు. కానీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది.

దర్శన్ కు హైకోర్టు బెయిల్

దీంతో దర్శన్‌ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court)ను ఆశ్రయించి.. అనారోగ్య కారణాలు చూపారు. దర్శన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నటుడి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేయడంతో అతడు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే దర్శన్ కారాగారం నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన సతీమణి విజయలక్ష్మి అక్కడకు వెళ్లారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *