Mana Enadu : కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై దీన్ని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ డాక్యుమెంట్ గురించి నెట్ ఫ్లిక్స్ ఓ అప్డేట్ షేర్ చేసింది.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టెయిల్ (Nayanatara Beyond The Fairy Tale)’ అనే టైటిల్‌తో రానున్న ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆరోజున నయన్ పుట్టిన రోజు కావడంతో ఆమె బర్త్ డే గిఫ్టుగా ఈ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనుంది. ఈ ప్రకటనతో ఈ సూపర్ స్టార్ డాక్యుమెంటరీ కోసం ప్రేక్షకులకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయన్ లైఫ్ లో సినిమాలకు ముందు ఏం జరిగింది..? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎలా ఉండేది..? లేడీ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు..? అనే అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు.
పార్ట్ టైమ్ మోడల్ నుంచి సూపర్ స్టార్ గా
అనుకోకుండా సినిమాల్లో అడుగుపెట్టిన నయనతార కాలేజీ రోజుల్లో పార్ట్ టైమ్ మోడల్ గా పని చేసింది. సత్యన్ అంతికాడ్ అనే దర్శకుడు ఒక సందర్భంలో ఆమెను చూసి ‘మనస్సిక్కరే’ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అలా 2003లో ఇండస్ట్రీలోకి వచ్చి నెమ్మదిగా ఒక్కొక్క అవకాశం అందుకుంటూ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు.
పెళ్లి వేడుక కూడా స్ట్రీమింగ్
‘నేను రౌడినే (Nenu Rowdy Ne)’ సమయంలో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార బాల్యం నుంచి పెళ్లి వరకు సాగే ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/hRoYd7SYjm
— Nayanthara✨ (@NayantharaU) October 30, 2024






