Mana Enadu: ప్రస్తుతం అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో(international test cricket) ప్లేయర్లు డిఫెన్స్ సరిగా ఆడలేకపోతున్నారని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్(Team India coach Gautam Gambhir) అభిప్రాయపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదని, ప్రస్తుత తరం క్రికెటర్లు ఎక్కువగా T20 క్రికెట్‌కు అలవాటు పడిపోయారని అన్నారు. రేపటి నుంచి న్యూజిలాండ్(New zealand)తో ముంబైలో జరిగే మూడో టెస్టుకు ముందు గౌతీ మీడియాతో మాట్లాడారు. టెస్టుల్లో నేటి తరం క్రికెటర్లు డిఫెన్స్ టెక్నిక్(Defense technique)ను మిస్ అవుతున్నారని అన్నారు. విజయవంతమైన టెస్ట్ క్రికెటర్ల విషయానికి వస్తే విరాట్, జోరూట్, స్టీవ్ స్మిత్, విలియమ్సన్ వంటి ప్లేయర్లు తమ తమ డిఫెన్స్ టెక్నిక్‌తో గొప్ప ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారని చెప్పారు. ఆటగాళ్లు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్(Practice) చేయాలని సూచించారు.
మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి
ఇక టీమ్ఇండియా పేసర్ జస్ర్పీత్ బుమ్రా(Jasprit Bumrah) గురించి మాట్లాడుతూ అతడు జట్టుకు విలువైన ఆస్తి అని చెప్పుకొచ్చాడు. బుమ్రాపై అధిక భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా బుమ్రా నెట్స్‌లో తక్కువ బౌలింగ్ సాధన చేయడంపై గౌతీ ప్రస్తావించాడు. బౌలర్ తన పనిభారాన్ని ఎలా నిర్వహించాలో, తన ప్రణాళికలను మైదానంలో ఎలా అమలు చేయాలో బుమ్రాకు తెలుసని అన్నాడు. బుమ్రా ఫిట్‌గా ఉండటం టీమ్ఇండియా అత్యంత ముఖ్యమని చెప్పుకొచ్చాడు. తర్వరలో బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) ఉన్ననేపథ్యంలో మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిపాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణా(Harshit Rana)కు అవకాశం లభించనుందని గౌతీ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..
కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్(WTC Points Table)లో అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా. ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవాలంటే.. తదుపరి 6 టెస్ట్‌ల్లో 3 గెలిచి ఒక్క మ్యాచ్ డ్రా చేసుకోవాలి. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్ గెలిచినా, ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత్‌కు WTC ఫైనల్ బెర్త్ దక్కుతుంది.








