ManaEnadu: జయం(Jayam), సై(Sye) మూవీలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరో నితిన్(Nitin). టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల అనుకున్న సక్సెస్‌ను సాధించలేకపోతున్నాడీ హీరో. తాజాగా పవర్ స్టార్ ఓల్డ్ మూవీ ‘తమ్ముడు (Thammudu)’ టైటిల్లో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని శ్రీరామ్ వేణు(Sriram venu) డైరెక్ట్ చేస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) రూపొందిస్తోంది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా కాంతార ఫేమ్ సప్తమీగౌడ(Saptami Gowda) నటిస్తోంది. సీనియర్ నటి లయ(Laya) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
తమ్ముడు చేసే పోరాటాలు చూడాల్సిందే..
తాజాగా ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్(First Look)ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అక్క, తమ్ముడి సెంటిమెంట్ చుట్టూనే ఈ స్టోరీ తిరుగుతుందట. అత్తారింట్లో అష్ట కష్టాలు పడుతున్న అక్కను కాపాడటానికి తమ్ముడి చేసే పోరాటమే సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఇప్పటికే నాని(Nani) నటించిన MCA సినిమాలో వదిన, మరిది ఎమోషన్‌ను చూపించి సక్సెస్ సాధించిన శ్రీరామ్, ఇప్పుడు అక్క, తమ్ముడి సెంటిమెంట్‌ను చూపించబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. కాగా నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్(Robin Hood)’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నితిన్ సరసన శ్రీలీల(Srileela) నటిస్తోంది.
వరుసగా ఐదు ప్లాప్‌లు
కాగా అప్పుడెప్పుడో మూడేళ్ల ముందు భీష్మ(Bheeshma) సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టాడు హీరో నితిన్. మళ్లీ ఇప్పటివరకు హిట్ అన్న మాటే లేదు. హిట్టు మాట అటుంచితే కనీసం ఒక్క సినిమానైనా యావరేజ్‌గా ఆడిందన్న మాట కూడా వినిపించలేదు. బోలెడంత టాలెంట్, టెర్రిఫిక్ పర్ఫార్మర్.. రెండూ కావాల్సినంత ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక అమావాస్యకో, పూర్ణిమకో హిట్టు కొట్టుకుంటూ పోతున్నాడు నితిన్. భీష్మ తర్వాత నితిన్ చేసిన 5 సినిమాలు ఒక దానికి మించి ఒకటి అల్ట్రా డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక గతేడాది డిసెంబర్ నెలలో రిలీజైన ఎక్స్ట్రార్డినరీ సినిమా సైతం రిలీజ్ అయ్యాక పట్టుమని పది రోజులు కూడా థియేటర్లలో నిలవలేకపోయింది.






