ManaEnadu: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గానూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంటర్‌టైయిన్ చేస్తున్నారు. ప్రముఖ OTT సంస్థ Ahaలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్(Unstoppable S4) టాక్ షోతో బుల్లితెరపైనా బాలయ్య దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా 3 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4 కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే సీజన్ 4లో AP CM చంద్రబాబు మొదటి గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే రెండో ఎపిసోడ్లో ‘లక్కీ భాస్కర్’ మూవీ అలాగే టీమ్ దుల్కర్ సల్మాన్ హాజరయ్యి సందడి చేశారు. ఇక ఇప్పుడు ‘కంగువ(Kanguva)’ మూవీ టీమ్ హాజరైంది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.
ఇరకాటంలో పడ్డ సూర్య
హీరో సూర్య(Suriya)తో బాలకృష్ణ సందడి చేశారు. ‘నేను సింహం అయితే అతను సింగం(Singam), నేను లెజెండ్(Legend) అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్’ అంటూ సూర్యకు అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు బాలయ్య. ఆ తర్వాత సూర్యతో సరదా ముచ్చటలతో.. తికమక పెట్టే ప్రశ్నలతో సూర్యను ఇరకాటంలో పెట్టారు. కార్తీ(Karthi) ఫోన్లో సూర్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుంది అని సూర్యను అడిగారు బాలయ్య.
చిన్నప్పటి నుంచి అంతే సార్
అలాగే సూర్య , కార్తీకి మధ్య గొడవైన లాస్ట్ టాపిక్ ఏంటి.? నీ ఫస్ట్ క్రష్(First Crush) ఎవరు.? అంటూ సూర్యను ఆడుకున్నారు బాలయ్య. అలాగే కార్తీకి ఫోన్ చేసి మీ అన్నయ్య చాలా అబద్ధాలు ఆడారు అని చెప్పగానే కార్తీ కూడా చిన్నప్పటి నుంచి అంతే సార్ అంటూ కౌంటర్ వేశాడు. అలాగే ఓ నటి అంటే ఆయనకు చాలా ఇష్టం సార్ అని కార్తీ అంటే.. వెంటనే సూర్య నువ్వు కార్తీ కాదు రా.. కత్తి అని డైలాగ్ వేశారు. సూర్య ఓ అమ్మాయి సాయం చేయగా.. ఆమె చెప్పిన మాటలను వీడియో రూపంలో చూపించారు బాలయ్య. ఇక చివరిలో కంగువ దర్శకుడు శివ(Director Shiva), బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కూడా బాలయ్య షోలో ఎంట్రీ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ప్రోమో(Promo)ని చూసేయండి..






