ManaEnadu : శీతాకాలం (Winter Season) మొదలైంది. నవంబరు మొదటి వారంలో చలి వణికిస్తోంది. ఇక తెల్లవారుజామున భారీగా పొగమంచు కురుస్తోంది. అయితే పొగమంచు (Fog) కురుస్తున్న సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రతి ఏటా నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో పొగమంచు కారణంగా రహదారి, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ప్రయాణం చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..?
పొగమంచులో ప్రయాణం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఉదయం 8 గంటల్లోపు.. అర్ధరాత్రి దాటిన తర్వాత దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం.
పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి.
పొగమంచులో వాహనం నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా లైట్లు ఆన్ చేసి ఉంచాలి.
ఫాగ్ లైట్స్ (Fog Lights) తప్పనిసరిగా ఆన్ చేయాలి.
హైవేలు, శివారు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలి.
విండ్ స్కీన్ర్ (Wind Screen), సైడ్ అద్దాలపై మంచు పొరను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
పొగమంచు కురుస్తున్నప్పుడు వాహన సామర్థ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి.
తెల్లవారుజాము ప్రయాణించే ముందు వైపర్లు సరిగా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా ఉన్నాయా? అనేది చెక్ చేస్కోవాలి.
కారులో వెళ్లేటప్పుడు హీటర్‌ను యూజ్ చేస్తే ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఉంటాయి.
ఇన్ని జాగ్రత్తలు పాటించినా రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనాన్ని నిలపివేయాలి.






