వామ్మో ఒకేసారి 3 సినిమాలకు డీల్

ManaEnaadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో prabhas సినిమా చేసే ఛాన్స్ రావడమంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది కేవలం హీరోయిన్లకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకు.. ఆకరికి నిర్మాతలకు కూడా. అందుకే రెబల్‌ స్టార్‌తో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఈనేపథ్యంలోనే హోంబలే ఫిల్మ్స్ Hombale Films పెద్ద డీల్ చేసుకుంది. ఏకంగా 3 సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ప్రకటించింది.

పెద్ద సినిమాలకు కేరాఫ్ ‘హోంబలే’
కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చిన నిర్మాణ సంస్థగా ‘హోంబలే ఫిల్మ్స్’కు మంచి పేరుంది. అంతపెద్ద సినిమా నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో ఏకంగా 3 సినిమాలను ఒకేసారి లాక్ చేయడంతో వాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ మూవీస్ ఉంటాయని హోంబలే హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో హైప్ నెలకొంది. మునుపెన్నడూ లేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించనున్నట్లు గుడ్ న్యూస్ కూడా చెప్పింది.

సలార్2తో షురూ
ఈ మూడు సినిమాల ప్రాజెక్ట్ ‘సలార్2’తో మొదలు కానుంది. అయితే మరో రెండు సినిమాలు ఏవి? ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. సలార్‌ను కూడా ఇదే సంస్థ నిర్మించింది. సలార్ సీజ్‌ఫైర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దానికి కంటిన్యూయేషన్‌గా ‘సలార్ శౌర్యాంగపర్వం’ తెరకెక్కనుంది. సలార్ హిట్టు కొట్టడంతో సలార్2పైనా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటా ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *