జార్ఖండ్ ఎన్నికలు.. ఉదయం 11గంటల వరకు 29.31 పోలింగ్‌

Mana Enadu : జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Polls 2024) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు బారులు తీరుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్‌ నమోదయింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.

ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కోరారు. మొదటి సారి ఓటు వేయబోతున్న యువతకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పిలుపునిచ్చారు.

రాంచీలో జార్ఖండ్ గవర్నర్ సంతోష్​ కుమార్ గంగ్వార్ (Jharkhand Governor Vote) ఓటేయగా.. కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా 43 నియోజకవర్గాల్లో బుధవారం తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఇతరులు ఒకరున్నారు. 43 నియోజకవర్గాల్లో జనరల్ అభ్యర్థులకు 17, ఎస్టీలకు 20, ఎస్సీలకు 6 స్థానాలు రిజర్వ్​డ్​గా ఉన్నాయి.

జార్ఖండ్‌లో ఎన్​డీఏ, ఇండియా కూటము(INDIA Alliance)ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఎన్​డీఏ కూటమి నుంచి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం చేశారు. ఇండియా కూటమి తరఫున మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన ప్రచారం చేశారు. రాష్ట్రంలో నవంబర్ 20న రెండో దశ ఎన్నికలు జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *