మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కొత్త మూవీ(New Movie)పై అప్డేట్ వచ్చేసింది. ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్(Ram Charan Janhvi Kapoor) జంటగా నటించనున్న ‘RC16’ మూవీ షూటింగ్(Shooting) వచ్చే వారం (నవంబర్ 22) ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం మైసూర్(Mysore)లో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని మూవీ వర్గాలు వెల్లడించాయి. క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో నిండిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఈ మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
100కేజీలకు పైగా బరువు పెరగనున్న రామచరణ్
ఈ తొలి షెడ్యూల్(First schedule)లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీతో పాటు చిత్రంలో ఇతర పాత్రలపై షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. కొంత టాకీతో పాటు ఓ యాక్షన్(Action) సన్నివేశాన్ని కూడా ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పణలో వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా కోసం రామ్ చరణ్ 100KGలకుపైగా బరువు పెరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా చెర్రీ
రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ ప్రమోషన్స్(Promotions)లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి(Sankranthi) కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇటీవల లక్నోలో ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ప్రమోషన్స్ టూర్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలో చెర్రీకి జోడీగా అందాల భామ కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తుండగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి, SJ సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు.
#RC16 Shooting Starts from 22nd November in Mysore #RamCharan #JanhviKapoor
A @BuchiBabuSana Film pic.twitter.com/tkElFJojBH
— Cinema Mania (@ursniresh) November 16, 2024






