మిస్ యూనివర్స్​ కిరీటం డెన్మార్క్ భామకే

Mana Enadu : ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న మిస్‌ యూనివర్స్‌ (Miss Universe) పోటీల్లో తాజాగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ (Miss Universe 2024) విజయం సాధించారు. ఈ పోటీల్లో ఆమె విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. మెక్సికో వేదికగా జరిగిన పోటీల్లో 125 మంది బరిలో నిలవగా.. 21 ఏళ్ల విక్టోరియా కెజార్‌ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్నారు. మరోవైపు చిడిమ్మ అడెట్షినా (Nigeria), మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ (Mexico).. మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. ఈ మేరకు షెన్నిస్ పలాసియోస్ (మిస్‌ యూనివర్స్‌ 2023) విజేతకు కిరీటాన్ని అందజేశారు.

నవశకం ప్రారంభం

‘‘కొత్త శకం మొదలైంది. 73వ విశ్వ సుందరిగా గెలుపొందిన విక్టోరియా (Miss Universe Victoria)కు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని ఆశిస్తున్నాం’’ అని మిస్‌ యూనివర్స్‌ టీమ్‌ తెలిపింది. మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న విక్టోరియాకు ఫ్యాషన్‌ ప్రియులు, ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరోవైపు, ఈ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న రియా సింఘా (Ria Singha) .. టాప్‌ 5లో నిలవలేకపోయారు.

మిస్ యూనివర్స్ గా తొలి డెన్మార్క్ భామ

డెన్మార్క్ (Denmark) నుంచి విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న తొలి భామగా విక్టోరియా నిలిచారు. 2004లో సోబోర్గ్‌లో ఆమె జన్మించారు. బిజినెస్‌ అండ్‌ మార్కెటింగ్‌లో డిగ్రీ పొంది వ్యాపారవేత్తగా మారారు. మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాడుతున్నారు. మోడలింగ్‌లోకి వచ్చిన విక్టోరియా.. మిస్‌ డెన్మార్క్‌గా తొలిసారి విజయాన్ని అందుకుని.. 2022లో జరిగిన మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో టాప్‌ 20లో నిలిచారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *