ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun), సుకుమార్(Director Sukumar) కాంబోలో తెరకెక్కన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2(Pushpa-2). అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఈ మూవీ ట్రైలర్(Trailer) నిన్న బిహార్‌లోని పాట్నాలో లాంచ్ చేశారు. 2.44 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్న ట్రైలర్‌లో పుష్పరాజ్ అరాచకమే సృష్టించాడు బన్నీ. ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. అదే రేంజ్‌లో ట్రైలర్ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో పుష్ప-2 ట్రైలర్ సోషల్ మీడియా(Social Media)ను ఊపేస్తోంది. ట్రైలర్ రిలీజైన కాసేపట్లోనే 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్(VIEWS)తోపాటు 1.4 మిలియన్స్ లైక్స్(LIKES) సాధించింది. దీంతో ఈ సినిమాపై అందిరిలోన హోప్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
రూ.2 వేల కోట్లు కొల్లగొట్టడం పక్కా
ముఖ్యంగా పుష్ప-2 ట్రైలర్‌లో స్టైలిష్ స్టార్(Stylish Star) అల్లు అర్జున్ విజువల్స్, యాక్షన్ సీన్స్(Action scenes), డైలాగ్స్(Dialogues) ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. బన్నీ మ్యానరిజం పార్ట్-1కి మించి ఉండటంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ BGM సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరోవైపు ట్రైలర్ చూస్తుంటే బన్నీ బాక్స్ ఆఫీస్(Box office) వద్ద పక్కా రూ.2 వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో 20 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
An 𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐈𝐍 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 ❤️🔥#Pushpa2TheRuleTrailer is the fastest to hit 40 MILLION+ Real-time VIEWS & 1.4 MILLION+ LIKES 🔥🔥
His RULE will be legendary 💥💥
▶️ https://t.co/4BQm7zPQ1c#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star… pic.twitter.com/hh4sfpLSnZ
— T-Series (@TSeries) November 17, 2024
పుష్పరాజ్ వన్ మ్యాన్ షో
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘‘నాకు కావాల్సింది అణా అయినా అర్ధణా అయినా.. అది ఏడు కొండల మీద ఉన్నా.. ఏడు సముద్రాల దాటి ఉన్నా.. పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు’’ అనే డైలాగ్‌ను బట్టి తన వ్యాపారంలో వచ్చిన డబ్బు కోసం ఎంత దూరం అయినా వెళ్తాడని.. ఆ క్రమంలో వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. పుష్పరాజ్(Pushpa Raj), శ్రీవల్లి మధ్య సీన్స్ కూడా హైలైట్ కానున్నాయి. ట్రైలర్‌లో పెళ్లి తర్వాత చూపించే సన్నివేశాలు బాగున్నాయి. మొత్తంగా ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.






