GHMC: హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేసిన భూకేటాయింపులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషఫన్(జిహెచ్ఎంసి) పరిధిలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25న) సంచలన తీర్పు ఇచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే కేటాయించిన భూములను భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూకేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయుల(జర్నలిస్టుల) సొసైటీలకు ప్రభుత్వం గతంలో భూకేటాయింపులు చేసింది. అయితే అవి ఈ తీర్పుతో చెల్లనేరవు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *