అక్కినేని ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. సీక్రెట్‌గా అఖిల్ ఎంగేజ్‌మెంట్

Mana Enadu : అక్కినేని కుటుంబంలో ఇప్పటికే పెళ్లి సందడి షురూ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పెద్ద తనయుడు నాగచైతన్య వివాహం నటి శోభితా ధూళిపాళతో మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సందడి కొనసాగుతుండగానే అక్కినేని అభిమానులకు ఈ కుటుంబం నుంచి మరో సర్ ప్రైజ్ ఎదురైంది. అదేంటంటే..?

అక్కినేని ఇంట మరో పెళ్లిసందడి

నాగార్జున చిన్న తనయుడు, నటుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కూడా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్ట బోతున్నాడు. తాజాగా అఖిల్ నిశ్చితార్థం జైనబ్ (Jainab) అనే యువతితో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.  తన మేనకోడలు జైనబ్‌తో అఖిల్‌ నిశ్చితార్థం (Akhil Engagement) జరిగినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అఖిల్ – జైనబ్ నిశ్చితార్థం

డిసెంబరు 4వ తేదీన నాగచైతన్య-శోభితల వివాహ వేడుక (Naga Chaitanya Marriage) జరగనున్న నేపథ్యంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగడంతో అక్కినేని అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు క్యూట్ పెయిర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడముచ్చటైన జంట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరేమో ఈ జైనబ్ ఎవరని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మొత్తానికి అఖిల్ ఎంగేజ్మెంట్ ఫొటోలు (Akhil Engagement Photos) నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

అఖిల్ సినిమా కెరీర్ సోసో..

ఇక అఖిల్ సినిమాల సంగతికి వస్తే ‘మనం’ సినిమాలో కామియో రోల్ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు అఖిల్. ఆ తర్వాత ‘అఖిల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ‘మనం’ దర్శకుడు విక్రమ్ తెరకెక్కించిన ‘హలో’ మూవీకి పాజిటవ్ రెస్పాన్స్ వచ్చింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అఖిల్ కెరీర్ లో కాస్త హిట్ అయిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ హీరో నుంచి చివరగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. ఆ సినిమా కూడా అభిమానులను నిరాశ పర్చింది. 

Share post:

లేటెస్ట్