Mobile Stolen/Lost: ఫోన్ పోయిందా? ఇలా చేయండి

మొబైల్ ఫోన్‌(mobile phones).. ప్రస్తుతం మనిషి జీవితంలో ఇదొక అతి ముఖ్యమైన గాడ్జెట్‌(Gadget). మనం అనేక విషయాలకు దీనిపైనే ఆధారపడుతుంటాం. అలాంటి విలువైన వస్తువును ఎవరైనా దొంగిలించినా, మిస్(stolen or lost) అయినా.. అందులో ఉండే ముఖ్యమైన ఫైల్స్‌, ఫొటోలు(Files & Photos) వంటివి కోల్పోవాల్సి వస్తుంది. అయితే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రీ(Central Equipment Identity Register) పోర్టల్‌ సహకారంతో పోయిన ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

 మీసేవ కేంద్రంలో ఫిర్యాదు చేయొచ్చు

సాధారణంగా ఎవరి ఫోనైనా పోయిన వెంటనే మీసేవ కేంద్రం(Mee seva Center)లో ఫిర్యాదు చేసి, ఫోన్‌లో ఉన్న నంబర్‌తోనే కొత్త సిమ్‌(New sim) తీసుకోవాలి. అనంతరం CEIR పోర్టల్‌ ఓపెన్ చేసి Block Stolen/Lost Mobile ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లో అప్పటివరకు వినియోగించిన ఫోన్‌ నంబర్లు, IMEI నంబర్లతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు ప్రతిని అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం.. కొత్త సిమ్‌కు రిక్వెస్ట్‌ ఐడీ (Request Id) వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా కేసు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇలా ఫిర్యాదు అందగానే CEIR పోర్టల్‌ 24 గంటల్లోనే స్పందించి ఫోన్‌ను బ్లాక్‌ చేస్తుంది.

 ఆ అలర్ట్‌ మెసేజ్‌‌తో ఈజీగా తెలిసిపోతుంది

సాధారణంగా ఫోన్ దొంగలించినవారు అందులో కొత్త సిమ్‌ వేసుకుంటారు. అయితే అలా చేసిన వెంటనే CEIRకి అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. ఫోన్‌లో వేసిన కొత్త సిమ్‌కు కూడా మెసేజ్‌(message) వెళ్తుంది. దీంతో ఫోన్ ఎక్కడుందో పోలీసులకు సులువుగా తెలిసిపోతుంది. పోలీసులు వెంటనే ఆ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని వివరిస్తారు. దీంతో ఫోన్ దొంగిలించిన/దొరికిన వ్యక్తి ఆ ఫోన్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్లీ దొరికిన ఫోన్ అన్-బ్లాక్ కావాలంటే యూజర్‌ CEIR పోర్టల్‌లో Un-Block Found Mobile ఆప్షన్‌ను ఎంచుకొని రిక్వెస్ట్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వివరాలు సమర్పించాలి.

14422కు SMS పంపాలి

కొందరు కాస్ట్లీ ఫోన్లను సెకండ్ హ్యాండ్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. అయితే, అలా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ఫోన్ IMEI నంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం తెలుసుకోవాలంటే.. KYM<15 అంకెల IMEI నంబర్‌> టైప్‌ చేసి 14422కు SMS పంపాలి. పంపి మీ ఫోన్‌ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పిన రోబో.. వీడియో చూశారా?

ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *