వాట్సాప్(WhatsApp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా వాట్సాప్ మూడు బిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. అయితే, వాట్సాప్ యూజర్‌బేస్(Userbase)ను మరింత పెంచుకోవడానికి న్యూ ఫీచర్‌లపై వర్క్ చేస్తోంది. యూజర్లు యాప్ నుంచి నేరుగా ఇతర కాంటాక్ట్‌లతో మొత్తం స్టిక్కర్ ప్యాక్‌ల(custom stickers with friends)ను క్రియేట్ చేయొచ్చుట. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశ(Beta testing phase)లో ఉంది. అప్‌డేట్ వెర్షన్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయొచ్చు. బీటా టెస్టర్‌లు మొత్తం స్టిక్కర్ ప్యాక్‌ల(custom stickers pack)ను వారి కాంటాక్టులతో షేర్(Share) చేయొచ్చు. టెస్టింగ్ తర్వాత ఈ ఫీచర్ త్వరలో మరింత మంది యూజర్లకు అందుబాటులో రానుంది.
ఏ చాట్‌లోనైనా స్టిక్కర్ పికర్‌ను ఓపెన్ చేయొచ్చు
ఫీచర్(Feature) ఎలా పనిచేస్తుందంటే వినియోగదారులు ఏ చాట్(Chat)లోనైనా స్టిక్కర్ పికర్‌ను ఓపెన్ చేయొచ్చు. ప్రతి స్టిక్కర్ ప్యాక్ పక్కన కొత్త త్రీడాట్స్ మెను తీసుకురానుంది. ఇది రెండు ఆప్షన్లను అందిస్తుంది. స్టిక్కర్ ప్యాక్‌ను షేరింగ్ చేయడం లేదా వారి వ్యక్తిగత లైబ్రరీ నుంచి తొలగించడం, షేర్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు(users) సులభంగా స్టిక్కర్ ప్యాక్‌లను స్నేహితులు, కుటుంబ సభ్యులు(Friends and family members) లేదా గ్రూప్ చాట్‌లకు పంపవచ్చు. వాట్సాప్ ద్వారా క్రియేట్ చేసిన ఫస్ట్-పార్టీ స్టిక్కర్ ప్యాక్‌ల కోసం షేరింగ్ అధికారిక స్టిక్కర్ స్టోర్‌కు నేరుగా లింక్‌ను రూపొందిస్తోంది.
బీటా టెస్టర్‌లకు స్టిక్కర్-షేరింగ్
ఈ ప్రక్రియ రిసీవర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో హోస్ట్ చేసిన స్టిక్కర్‌లను వాట్సాప్ మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టోర్ నుంచి ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అదే సమయంలో, థర్డ్-పార్టీ స్టిక్కర్ ప్యాక్(Third-party sticker packs)లను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. కాంటాక్టులు లేదా గ్రూపులతో షేర్ చేయవచ్చు, కస్టమైజడ్ స్టిక్కర్(custom stickers) సెట్‌లను క్రియేట్ చేయడం లేదా కలెక్ట్ చేసే యూజర్లకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన బీటా టెస్టర్‌లకు స్టిక్కర్-షేరింగ్ ఫీచర్ పరిమితంగా ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుంది.








