యంగ్ ట్యాలెంట్ సత్యదేవ్ ((Satyadev) నటించిన జీబ్రా (Zebra) ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ అంత గొప్పగా ఏమీ లేదని, అలాగని తీసిపారేసే చిత్రం కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే సత్యదేవ్‌తోపాటు సినీ బృందం బ్లాక్‌బస్టర్ అయ్యిందంటున్నారు. ఇటీవలే సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి సందీప్ కిషన్, శ్రీవిష్ణు, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శితోపాటు పలువురు యువ నటీనటులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే నవంబర్ 22న విడుదలైన జీబ్రా మూవీ 8 రోజుల్లో రూ.9.45 కోట్లు వసూలు చేసిందని సత్యదేవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ‘ఎక్స్’లో ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. డే వన్ కంటే డే 8వ రోజు కలెక్షన్ ఎక్కు వచ్చినట్లు పేర్కొన్నాడు. నార్మల్‌గా చూసుకుంటే ఈ కలెక్షన్ చాలా తక్కువ. ఎంత బడ్జెట్‌తో సినిమా తీశారు. ఇతర ఖర్చులు ఎంతయ్యాయి? ఇంకా రికవరీ చేయాల్సింది ఎంత? అన్నది చిత్రయూనిట్‌కే తెలియాలి.
సత్యదేవ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘VD 12’ వర్కింగ్ టైటిల్‌తో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ కీ రోల్ కోసం సత్యదేవ్‌ను చిత్ర బృందం సంప్రదించిందని, ఇందుకు అతడు అంగీకరించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. సత్యదేవ్ రోల్ విజయ్ దేవరకొండకు హెల్ప్ చేస్తూనే వెన్నుపోటు పొడిచేలా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఈ సినిమా షూటింగ్లో కూడా భాగం అయినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అతడి పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. 2025 సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్లో విజయ్ దేవరకొండ లుక్ అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.
❤️❤️❤️#zebra pic.twitter.com/WUKRf1kN7Q
— Satya Dev (@ActorSatyaDev) November 30, 2024






