Flight Tickets: ప్రయాణికులకు షాక్.. ఫ్లైట్ టికెట్‌ రేట్స్ భారీగా పెంపు!

విమాన సంస్థలు(Airlines) ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. అంతర్జాతీయంగా చమురు కంపెనీలు(oil companies) విమాన ఇంధన ధరలు(fuel prices) పెంచుతున్న నేపథ్యంలో ఫ్లైట్ టికెట్లు(Flight tickets) మరింత పెరిగే అవకాశం ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(aviation turbine fuel) ధరను చమురు సంస్థలు నెల క్రితమే కిలోలీటర్‌(Kilolitre)కు రూ.2941 పెంచగా, దాన్ని తాజాగా మరో రూ.1318 పెంచాయి. దీంతో ప్రస్తుతం ఏటీఎఫ్ కిలోలీటర్ ధరలు ఢిల్లీలో రూ.91,856గా, కోల్‌కతాలో రూ.94,551గా, ముంబైలో రూ.85,861గా, చెన్నైలో రూ.95,231గా ఉన్నాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైట్ టిక్కెట్ల(Flight tickets Rates) ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇంధన, లేబర్ ఖర్చులు పెరగడంతోనే

ప్రభుత్వ చమురు సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)తోపాటు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రతి నెలా మొదటి తేదీన జెట్ ఇంధనం, వంట గ్యాస్ ధరల(jet fuel and cooking gas prices)ను సవరిస్తున్న విషయం తెలిసిందే. చమురు కంపెనీలు ఇంధన ధరలను అక్టోబరు 1న కిలోలీటర్‌కు ₹ 5,883, సెప్టెంబర్ 1న ₹ 4,495.5 చొప్పున నెలవారీ తగ్గించి, నవంబర్ 1న ఒక్కసారిగా పెంచేశాయి. దీంతోపాటు ఇంధన ఖర్చులు, లేబర్ ఖర్చలు(Fuel costs, labor costs) పెరగడంతో ప్రయాణికులపై భారం తప్పదని విమానసంస్థలు అంటున్నాయి.

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు?

ఇదిలా ఉండగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య సిలిండర్ ధర (Commercial cylinder) వరుసగా ఐదోసారి పెరిగాయి. ప్రస్తుతం కమర్షియల్ 19 కిలోల సిలిండర్‌కు ₹ 16.5 పెరిగింది. ఇది ఢిల్లీలో ₹ 1818.50, ముంబైలో ₹ 1771, కోల్‌కతాలో ₹ 1,927, చెన్నైలో ₹1,980కి అందుబాటులో ఉంది. ఇక ఆగస్టు నుంచి ఒక్కో సిలిండర్‌పై ₹ 172.5 చొప్పున ధరలు పెరిగాయి. కాగా ప్రస్తుతం గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర 14.2 కిలోల సిలిండర్‌కు ₹803గా ఉన్నట్లు చమురు సంస్థలు(oil companies) పేర్కొన్నాయి.

 

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *