‘KCR ఫామ్‌హౌస్’.. CM రేవంత్ వ్యాఖ్యలపై MLA వేముల ఫైర్

తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్(Congress vs BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏ సభకు వెళ్లినా KCR, KTR, హరీశ్‌రావులపై BRS పాలనలో చేసిన తప్పులను ఎత్తిచూపుతూనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, అంతులేని అవినీతి(Corruption) జరిగిందని ఇప్పటికే చాలా సార్లు సీఎం రేవంత్ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎప్పటికప్పుడు రివర్స్ కౌంటర్(Reverse counter) ఇస్తూనే ఉన్నారు. గుంపు మేస్త్రి పనితనం మాటల్లో తప్ప ఇచ్చిన హామీల అమలులో లేదని గట్టిగానే సీఎం రేవంత్‌ని ఉద్దేశించి కాంగ్రెస్‌కు చురకలంటిస్తున్నారు.

మీరెంత.. నా కాలు గోటితో సమానం: సీఎం రేవంత్‌

ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో CM మాట్లాడారు. ‘‘రైతులే మా అంబాసిడర్లు. తాను పుట్టింది. పెరిగింది నల్లమల్ల అడవుల్లో.. పులులను చూశా.. అడవిలో ఉండే మృగాలను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత.. నా కాలు గోటితో సమానం’’ అంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగా BRS నేతలపై హాట్ కామెంట్స్(Hot comments) చేశారు. అంతటి ఆగకుండా మాజీ సీఎం KCR 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్(KCR Farm house) కట్టుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, MLA వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

లేకుంటే ముక్కు నేలకు రాస్తావా?: ఎమ్మెల్యే వేముల

తెలంగాణలోని రైతులకు రైతుబంధును ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashant Reddy)మండిపడ్డారు.CM రేవంత్ రెడ్డి గ్రాఫ్(Graph) పడిపోయిందని చెప్పారు. ఇక మాజీ సీఎం కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.KCRకు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే.. తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి పోతావా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్‌ను చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందింస్తుందో మరి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *