Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ ఫోకస్

హైదరాబాద్(HYD) నగరంలోని గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్న నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారుల(of superiors)తో సమీక్షించారు.

మౌలిక వసతులపై ఫోకస్ చేయండి

అలాగే ఆసుపత్రి(Hospital)కి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ(Transportation system) ఉండాలని సూచించారు. రహదారు(Roads)ల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో అన్ని శాఖలతో సమన్వయం కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను నోడల్ అధికారి(Dana Kishore as the nodal officer)గా సీఎం రేవంత్ నియమించారు. ఆసుపత్రికి ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల(Electricity and drainage systems)ను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కలెక్టర్ అనుదీప్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *