Kohli: విరాట్ తాగే బ్లాక్ వాటర్ ఖరీదెంతో తెలుసా?

Mana Enadu : ఇండియా క్రికెట్ టీంలో విరాట్ కోహ్లి( Virat Kohli)కి ఉన్నంతా క్రేజ్ మరెవరికీ లేదు. 37 ఏళ్ల వయసులో కూడా విరాట్ కోహ్లి ఫుల్ ఫిట్ నెస్ తో మైదానంలో చిరుతలా కదులుతాడు. యంగ్ క్రికెటర్ల వలే క్రీజులో స్పీడ్ గా పరుగెత్తుతాడు. విరాట్ ఇంతలా ఫిట్ గా ఉండటానికి కారణాల్లో ఒకటి బ్లాక్ వాటర్. విరాట్ తాగే వాటర్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మినరల్ వాటర్ కి బదులు ‘బ్లాక్ వాటర్’ని తాగుతాడు. నార్మల్ వాటర్ బాటిల్ ధర రూ. 20 నుంచి 50 వరకు ఉండొచ్చు. కానీ విరాట్ కొహ్లి తాగే నీళ్ల బాటిల్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టకమానరు.

బాలీవుడ్ నటులూ బ్లాక్ వాటర్ తాగుతున్నారు..

ఈ బ్లాక్ వాటర్ బాటిల్ ధర రూ. 600 నుంచి రూ. 3వేల వరకు ఉంటుంది. దీన్ని ప్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు విరాట్. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం కోహ్లి అలవాటు చేసుకున్నాడు. కోహ్లితో పాటు మరికొందరు బాలీవుడ్, సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, శ్రుతిహాసన్ కూడా ఫిట్ గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు.

pH స్థాయి ఎక్కువగా ఉంటుంది

అయితే బ్లాక్ వాటర్ తాగడం వెనక పెద్ద కథే ఉంది. నీటికి రంగు, రుచి ఉండవని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ నీళ్లు నలుపు రంగులో ఉంటాయి. సాధారణ నీటితో పోలిస్తే బ్లాక్ వాటర్ pH స్థాయి ఎక్కువగా ఉంటుంది. సాధారణ నీటి pH స్థాయి 6 నుంచి 7గా ఉంటుంది. అదే ఈ బ్లాక్ వాటర్ pH స్థాయి మాత్రం 8.5 కావడం విశేషం. ఈ బ్లాక్ వాటర్లో 70కి పైగా మినరల్స్ ఉంటాయి. దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ బ్లాక్ వాటర్ లోని అణువులు చిన్నగా ఉంటాయి. మన శరీర కణాలు సులువుగా శోషిస్తాయి.

ఫిట్‌గా ఉండేదుకే..

అంతేకాదు ఈ బ్లాక్ వాటర్ అణువులు మన శరీర వ్యవస్థకు మనం అందించే పోషకాలను నిలుపుకోవడంలోనూ చాలా వేగంగా పని చేస్తాయి. ఈ బ్లాక్ వాటర్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ వాటర్ ఉపయోగపడతాయి. అందుకే విరాట్ కొహ్లీ తాను ఫిట్ గా ఉండేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ బ్లాక్ వాటర్ ను తాగుతున్నాడు. అయితే విరాట్ ఇప్పటికే నాన్ వెజ్ మానేసి వెజ్ తింటున్నాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితమే వెజిటేరియన్ గా మారిపోయారు. అప్పటి నుంచి ఫుల్ ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు. దీంతో కెరీర్ లో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకుంటున్నాడు. వ్యాయామం కూడా చేయడానికి విరాట్ ఎక్కువగా ఇష్టపడతాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *