వాళ్లకు నరకం చూపిస్తా.. హమాస్‌కు ట్రంప్‌ హెచ్చరిక

Mana Enadu : ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల మధ్య యుద్ధంతో గత కొంతకాలంగా పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ చెరలోని బందీ (Hamas Hostage)లకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్‌ విడుదల చేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) దానిపై స్పందించారు. ఈ సందర్భంగా మిలిటెంట్‌ సంస్థపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వాళ్లకు నరకం చూపిస్తా

ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని.. లేకపోతే ఈ దారుణాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తానని హెచ్చరించారు. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. వెంటనే బందీలను విడుదల చేయండని ట్రంప్ (Trump Warns Hamas) డిమాండ్ చేశారు.

రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ (Hamas) మిలిటరీ విభాగం అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్‌ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో.. అమెరికా-ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ మాట్లాడుతూ.. తాను గత 420 రోజులుగా హమాస్‌ చెరలో బందీగా ఉన్నానని తెలిపాడు. తామంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని.. త్వరగా విడిపించాలని అభ్యర్థించాడు.

51 మంది మాత్రమే సజీవం

గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లగా.. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు.  పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందగా.. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *