Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’. పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పార్ట్-1 కంటే కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో పుష్పరాజ్ నటనకు ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. ఆయన పర్ఫామెన్స్ కు నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమా బన్నీని ఎలివేట్ చేసే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయంటున్నారు.
పుష్ప-2 బ్లాక్ బస్టర్
ఇక ఈ సినిమాలో జాతర సీన్ లో అల్లు అర్జున్ నటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ప్రీమియర్ షోలు, మొదటి ఆట తర్వాతే పుష్ప-2 సినిమాకు పాజిటివ్ రివ్యూ(Pushpa 2 Review)లు వచ్చేశాయి. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ హిట్ టాక్ వినిపిస్తోంది.
బన్నీ ఈసారి నేషనల్ వైడ్ గా కాదు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అవి కొందరిని ఉద్దేశించినట్లుగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పుష్పరాజ్ డైలాగ్స్ కాంట్రవర్సీ
గతకొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీకి పెద్దగా పొసగడం లేదన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కాదని వైసీపీ నేతకు ప్రచారం చేయడం ఈ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిందని టాక్. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వార్తలొస్తున్నాయి.
ఇక మెగా, అల్లు ఫ్యాన్ వార్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇక మెగా ఫ్యామిలీని కాదని.. అల్లు అర్జున్ తన ఇమేజ్ ను ఎస్టాబ్లిష్ చేసుకునేలా పుష్ప-2లోని కొన్ని డైలాగ్స్ ఉండటంతో మెగా యాంటీ ఫ్యాన్స్ అందరూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఆ డైలాగ్స్ ఏంటో ఓసారి చూద్దామా..
పుష్పరాజ్ మాస్ వార్నింగ్స్
- “ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్……ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్”
- “అలాగే ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు.”
- “ఎత్తులో ఉన్నప్పుడు ఈగోలు ఉండకూడదు”.
ఈ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇవి అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ను మరింత ముదిరేలా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇవి కేవలం సినిమాలో హీరో పాత్రను ఉద్దేశించినవే అని కొందరంటుంటే.. కావాలనే బన్నీ ఇలాంటి డైలాగ్స్ రాయించుకున్నాడని మరికొందరు అంటున్నారు. కథను బట్టి చూస్తే దర్శకుడు సుకుమార్ కంటెంట్ కు తగ్గట్లే ఆ డైలాగ్స్ రాసుకున్నట్లు అర్ధమవుతుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.






