Pushpa 2 Review : పుష్పరాజ్ వైల్డ్ ట్రీట్.. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలు

Mana Enadu : ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. నీయమ్మ తగ్గేదేలే’.. అంటూ ఓ పాత్రను ఏకంగా బ్రాండ్ గా మార్చేశాడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘పుష్ప – ది రైజ్’ సినిమాతో డైరెక్టర్ సుకుమార్(Sukumar).. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ చేశారు. పుష్ప మేనేరిజాన్ని ప్రపంచం మొత్తం ఇమిటేట్ చేసింది. ఫారిన్ ఫ్యాన్స్ నుంచి క్రికెటర్స్, నటులు కూడా పుష్ప మేనరిజాన్ని ట్రై చేశారంటే ఈ సినిమాకు, ఇందులో బన్నీ నటనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప పార్ట్-1కు కొనసాగింపుగా ఇప్పుడు ‘పుష్ప2: ది రూల్‌ (Pushpa 2 : The Rule)’ వచ్చింది. ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ఇవాళ థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చాడు పుష్పరాజ్. మరి పుష్ప పార్ట్-2 సినిమా పార్ట్-1 కు దీటుగా ఉందా? తెలుసుకుందామా?

  • చిత్రం: పుష్ప2: ది రూల్‌
  • నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక (Rashmika Mandanna), ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
  • సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌
  • ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
  • నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి
  • రచన, దర్శకత్వం: సుకుమార్‌
  • నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌
  • విడుదల: 05-12-2024

రేటింగ్ : 3/5

పుష్ప స్టోరీ ఇదే 

శేషాచలం అడవుల్లో ఓ సాధారణ కూలీగా ప్రయాణం షురూ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగిన పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్) తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (Fahadh Faasil)తో పుష్పరాజ్ వైరం పెరుగుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై ఫోకస్ చేస్తాడు. అయితే బయట ఫైర్ గా ఉండే పుష్ప ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు.

తన భర్త సీఎంతో కలిసి ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది శ్రీవల్లి ఆశ. పెళ్లాం కోరిక మేరకు పుష్ప.. ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు (Rao Ramesh)తో కలిసి సీఎం దగ్గరికి వెళ్లాక ఏం జరిగింది? షెకావత్‌ని ఎదుర్కొంటూ పుష్ప తన బిజినెస్ ఎలా విస్తరించాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కి, పుష్పకీ ఏంటి సంబంధం? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

మూవీ ఎలా ఉంది?

ఈసారి నేషనల్ కాదు… ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే పార్ట్-2 ఉంది. దర్శకుడు కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ను యాడ్ చేశాడు. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమా షురూ చేసిన డైరెక్టర్.. ఎలివేషన్స తో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. మాల్దీవుల్లో బిజినెస్ డీల్, వంద కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్‌. పుష్ప (Pushpa 2 Review), షెకావత్ ఎత్తులు పైఎత్తులు సినిమాలో మాంచి డ్రామాను క్రియేట్ చేశాయి.

ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి. షెకావత్‌కి ఊహించని రీతిలో పుష్ప ఝలక్ ఇవ్వడం ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం పుష్ప డీలింగ్స్ గురించే కాదు ఫీలింగ్స్ గురించి కూడా. భార్య శ్రీవల్లి (Rashmika Mandanna) మాట జవదాటని భర్తగా పుష్ప మెప్పిస్తాడు. భర్త… భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్ లో గంగమ్మ జాతర (Pushpa 2 Gangamma Thalli Jathara) ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు సీట్లో కూర్చోవడం కాస్త కష్టమే. బన్నీ చీర కట్టుకున్న ప్రతిసారి థియేటర్లో పూనకాలే. జాతర ఎపిసోడ్‌(Pushpa 2 Jathara Scene)లో శ్రీవల్లి పాత్ర కూడా హైలైట్. అయితే మూడు గంటల నిడివి సినిమాకు కాస్త మైనస్ అని చెప్పొచ్చు. ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఫైట్ వృథా. డైలాగ్స్ లో కొన్నిచోట్ల క్లారిటీ కరువైంది. ఇక షెకావత్ ఎంట్రీకి ఉన్న పవర్.. ఆయన విలనిజంలో కనిపించదు. సినిమా చివరలో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్టుతో ‘పుష్ప-3’కి హింట్ ఇచ్చాడు డైరెక్టర్.

యాక్టింగ్ ఎలా ఉందంటే..?

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. యాస, ఎక్స్ ప్రెషన్స్ తో పార్ట్-2లో తన హవా చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ లో బన్నీ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక శ్రీవల్లితో పుష్ప కెమిస్ట్రీ అదిరిపోయింది. జాతర ఎపిసోడ్‌లో రష్మిక నటన బాగుంది. ‘కిస్సిక్’ పాటతో శ్రీలీల (Sreeleela Pushpa 2P) అదరగొట్టింది. షెకావత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదిరింది కానీ ఆ పాత్రను డైరెక్టర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. దేవీశ్రీప్రసాద్ పాటలు బాగున్నాయి. అలాగే సామ్ సీఎస్ బీజీఎం చక్కగా కుదిరింది. ఎడిటింగ్‌కు కాస్త పని పెట్టాల్సింది. 

ప్లస్ పాయింట్స్
+ అల్లు అర్జున్ నటన
+ ఎలివేషన్స్
+ జాతర ఎపిసోడ్‌

మైనస్ పాయింట్స్
– తేలిపోయిన విలనిజం
– సినిమా నిడివి

కన్ క్లూజన్ : పుష్ప2… థియేటర్లలో ఐకాన్ స్టార్ మాస్ జాతరకు పూనకాలే పూనకాలు

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *