ఓటీటీలోకి ఆలియా భ‌ట్ ‘జిగ్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ (Alia Bhatt) న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ ‘జిగ్రా’ (JIGRA). వసన్ బాల తెరకెక్కించిన ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహీన్ భట్ & సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆలియా సోదరుడిగా యంగ్ హీరో వేదాంగ్ రైనా నటించగా.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) మెరిశాడు.

తమ్ముడి కోసం ప్రాణాలు తెగించిన ఆలియా

ఈ సినిమాలో ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమ్ముడి కోసం అక్క ప్రాణాలకు తెగించి పోరాడే పాత్రలో ఆలియా (Alia Jigra Ott) తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్రంలో తన యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అక్కాదమ్ముళ్ల సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ తో కంటనీరు పెట్టించింది. కొన్ని సీన్లలో ఆలియా నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. జిగ్రా మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా డిసెంబరు 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా స్టోరీ సంగతికి వస్తే..

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన సత్యభామ ఆనంద్ (ఆలియా భ‌ట్) తన తమ్ముడు అంకుర్ (Vedang Raina)ని అన్నీ తానై పెంచుతుంది.  బిజినెస్ ప‌ని మీద హన్షదావో అనే దీవికి వెళ్తాడు అంకుర్‌. అక్కడ చేయని తప్పునకు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగించిన కేసులో అంకుర్ కు మరణ శిక్ష విధిస్తుంది అక్కడి కోర్టు. ఈ విషయం తెలుసుకున్న సత్య తన తమ్ముడిని కాపాడుకునేందుకు హన్ష‌దావోకి వెళ్తుంది. అక్కిడికెళ్లాక ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి? త‌న త‌మ్ముడిని మరణశిక్ష నుంచి ఎలా తప్పించింది.. అస‌లు అంకుర్ డ్ర‌గ్స్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *