పుష్ఫ 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మహిళ మృతి చెందగా.. బాలుడు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అంటూ టాలీవుడ్ లో సందడి కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి ఏరియాలలో ఎక్కువగా స్పెషల్ షోలు వేస్తుంటారు. మహిళ చనిపోవడం బాలుడు సీరియస్ గా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం (telangana government) బెనిఫిట్ షోలను సీరియస్ గా తీసుకుంది. బెనిఫిట్ షోలను రద్దు చేసేందుకు ఆర్డర్స్ ఇస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komati reddy venkat reddy) ప్రకటించారు. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు.
సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటీ?
‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే పెద్ద సినిమా ”గేమ్ ఛేంజర్” (game changer). రామ్ చరణ్ (ram charan) నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. దీంతో పాటుగా బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు కూడా రెండేసి రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.
‘గేమ్ ఛేంజర్’కు బెనిఫిట్ షో రాకపోతే
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి రాబోతున్న మైలురాయి 50వ సినిమా ‘గేమ్ చేంజర్’. అందుకే దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడ్జెట్ కు ఏ మాత్రం వెనకాడకుండా నిర్మించారు. డైరెక్టర్ శంకర్ ( director shankar) ఎంత చెబితే అంత ఖర్చు చేసారు. ఒకవేళ ‘గేమ్ చేంజర్’ బెనిఫిట్ షోలకు అనుమతి తెచ్చుకుంటే, ఇకపై రాబోయే అన్ని పెద్ద సినిమాలకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే గానీ జరిగితే సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటన, ప్రస్తుతానికి ప్రజలను కూల్ చెయ్యడానికి ఇచ్చిన స్టేట్మెంట్ అనుకోవాలి.
దిల్ రాజుకు కీలక పదవి
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు (dil raju) తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ఎసీ (telangana film devolopment corporation)) ఛైర్మన్ గా ఆయన్ని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ . దిల్ రాజు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.2003లో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది.






