Anasuya Bharadwaj: ‘హరిహర వీరమల్లు’లో అనసూయ స్పెషల్ సాంగ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan).. డైరెక్టర్ జ్యోతికృష్ణ(Director Jyotikrishna) కాంబోలో రానున్న పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మరోపైపు రాజకీయాల్లో పవన్(
Pawan in politics) బిజీబిజీగా ఉన్నప్పటికీ 2025 మార్చి 28కి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసే సంకల్పంతో మేకర్స్ ఉన్నారు. దీనిపై నిర్మాత AM రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ కూడా ఇదే మాట చెప్పారు. మరోపక్కVFXకు సంబంధించి ఎలాంటి ఆలస్యం జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ Tటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

పవన్‌తో ఛాన్స్ అంటే వేరే లెవెల్

పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో ఒక స్పెషల్ సాంగ్‌(Special Sing)లో అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. గణేష్ మాస్టర్(Ganesh Master) కొరియోగ్రఫీలో ఈ సాంగ్ గతంలోనే షూట్ చేశారట. అయితే అఫీషియల్‌గా దీనిపై క్లారిటీ లేదు కానీ.. ఎంఎం కీరవాణి(MM Keeravani) కంపోజ్ చేసిన ఒక మాస్ డ్యాన్స్ నంబర్ దీని కోసమేనని అంటున్నారు. గతంలో ‘అత్తారింటికి దారేది;లో పబ్ సాంగ్ చేయమన్నప్పుడు అనసూయ నో చెప్పడం, దానికి సోషల్ మీడియా(Social Media)లో చిన్నపాటి దుమారం రేగడం అప్పటి జనాలకు గుర్తే. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్‌తో జట్టు కట్టే ఛాన్స్ రావడమంటే లక్కీ అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇద్దరు మెగా హీరోల చిత్రాల్లో

ఇదిలా ఉండగా రంగస్థలంలో రామ్ చరణ్(Ram charan), గాడ్ ఫాదర్‌లో చిరంజీవి(Chiranjeevi)తో కలిసి నటించిన అనసూయకు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేయడంతో ఫుల్ సర్కిల్ పూర్తయ్యింది. డిప్యూటీ సీఎం(Deputy CM)గా పవన్ నుంచి రాబోయే మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైప్(Hype) పరంగా ఓజినే ముందున్నప్పటికీ రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లు పబ్లిసిటీని భారీ ఎత్తున ప్లాన్ చేయడం ద్వారా బజ్(Buzz) పెంచే ప్లానింగ్ జరుగుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *