Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలున్నాయి. అందులో ఒకటి మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న అఖండ 2 (Akhanda 2). ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
అఖండ-2తో ఆ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ
బాలయ్య బాబు అఖండ-2 సినిమాతో టాలీవుడ్‌లోకి ఓ సీనియర్ నటి కూతురు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అలనాటి పాపులర్ నటి లయ (Actress Laya) కుమార్తె శ్లోక ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా శ్లోక (Laya Daughter Shloka) ఎంట్రీ ఖాయమైనట్లు టాక్.. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. ఒకవేళ అదే నిజమైతే శ్లోకకు బోయపాటి అఖండ-2లో ఎలాంటి పాత్ర ఇస్తారని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదరగొట్టే తమన్ బీజీఎం
ఇక అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ (SS Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. పార్ట్-1కు తమన్ ఇచ్చిన బీజీఎం ఏ రేంజులో ఉందో తెలిసిందే. ఇద సీక్వెల్ కు ఎలాంటి బీజీఎం వాయిస్తాడోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తప్పకుండా ఇతగాడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో కూడా ఇది నిజమేనని ప్రూవ్ చేస్తోంది.
గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్
ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో (Akhanda 2 Promo)లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది అంటూ బాలయ్య బాబు తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. అఖండ-2లో బోయపాటి బాలయ్యను ఎలాంటి రౌద్ర రూపంలో చూపిస్తాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఫస్ట్ పార్టులో ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ గా నటించింది. సెకండ్ పార్టులోనూ ఆమె కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇక అఖండలో శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.







