
సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్(Sritej) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు 13రోజులుగా ఈ చిన్నారి ఆసపత్రి(Hospital)లోనే చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి(Health Condition) విషమంగా ఉంది. ఈ మేరకు మంగళవారం రాత్రి కిమ్స్ వైద్యులు(Kims Doctors) శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్(Health Bulletin)ను విడుదల చేశారు. వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస(Artificial respiration on ventilator) అందిస్తున్నామని చెప్పారు. అతనికి జ్వరం(Fever) పెరుగుతోందని కానీ మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్(parameters) స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఫీడ్‌లను బాగానే తట్టుకుంటున్నాడు కానీ దీని బట్టి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం చెప్పలేమని అంటున్నారు.
ఎప్పుడు ఏమవుతోందో తెలియని పరిస్థితి
ఇదిలా ఉండగా శ్రీతేజ్‌కు ఎప్పుడు ఏమవుతోందో తెలియని పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు. స్టాటిక్ న్యూరోలాజికల్(Static neurological) స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని(Tracheostomy) ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్(Oxygen) సరిగ్గా అందడం లేదని, ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంత కాలం ఉండాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. కాగా ఈ నెల 5న పుష్ప2 ప్రీమియర్ షో(Pushpa 2 premiere show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యాడు.
షోకాజ్ నోటీసులు జారీ
మరోవైపు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు(Showcause notices) జారీ చేసినట్లు CP సీవీ ఆనంద్ తెలిపారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలన్నారు. తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యాన్ని వివరణ కోరారు. 13 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో సూచించారు. తొక్కిసలాట కేసు నేపథ్యంలో ఈనెల 12వ తేదీన అల్లు అర్జున్(Allu Arjun)ను అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్(Remand) విధించింది. దీంతో ఆయన అత్యవసర పిటిషన్‌గా హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది.
విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన KIMS ఆసుపత్రి
వెంటిలేటర్ పై శ్రీ తేజ్ కు కృత్రిమ శ్వాస అందిస్తున్న వైద్యులు pic.twitter.com/7rBzuy44G4
— Tharun Reddy (@Tarunkethireddy) December 17, 2024