‘లాపతా లేడీస్’కు నిరాశ.. ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో సంతోష్

Mana Enadu : ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి హిందీ సినిమా ‘లాపతా లేడీస్ (laapataa ladies)’ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన  ఆస్కార్ షార్ట్ లిస్టులో ఈ సినిమాకు చోటు దక్కలేదు. 97వ అకాడ‌మీ అవార్డుల కోసం భార‌త్ నుంచి బెస్ట్ ఇంట‌ర్నేష‌న్ ఫీచ‌ర్ కేట‌గిరీలో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా తుది జాబితా నుంచి ఔట్ అయింది.

ఆస్కార్ రేసులో సంతోష్

15 చిత్రాల షార్ట్‌లిస్టు నుంచి అయిదింటిని తుది రేసుకు ఎంపిక చేస్తారు. ఈ జాబితాలో ఇండియా నుంచి  లాప‌తా లేడీస్ లేకున్నా.. భారతీయ ఫిల్మ్‌మేక‌ర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్ (Santosh)’ అనే చిత్రానికి మాత్రం చోటు దక్కింది.  ఈ ఫిల్మ్‌లో ఇండియ‌న్ స్టార్స్ సహానా గోస్వామి, సునితా రాజ్వార్ న‌టించారు. అయితే ఈ ఫిల్మ్ యూకే త‌ర‌పున ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇచ్చింది.

జనవరి 17న నామినేషన్లు

మరోవైపు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ కేట‌గిరీలో.. ఎమిలియా పెరిజ్‌(France), ఐయామ్ స్టిల్ హియ‌ర్‌(బ్రెజిల్‌), యునివ‌ర్స‌ల్ ల్యాంగ్వేజ్‌(కెన‌డా), వేవ్స్‌(చెక్ రిప‌బ్లిక్‌), ద గ‌ర్ల్ విత్ ద నీడిల్‌(డెన్మార్క్‌), ద సీడ్ ఆప్ ద సాక్రెడ్ ఫిగ్‌(జ‌ర్మ‌నీ), ట‌చ్‌(ఐస్‌ల్యాండ్‌), నీక్యాప్‌(ఐర్లాండ్‌), వెర్మిగ్లో(ఇట‌లీ),ఫ్లో(లత్వియా), ఆర్మండ్‌(నార్వే), ఫ్ర‌మ్ గ్రౌండ్ జీరో(పాల‌స్తీనా), ద‌హోమే(సెనిగ‌ల్‌), హౌ టు మేక్ మిలియ‌న్స్ బిఫోర్ గ్రాండ్‌మా డైస్‌(థాయిలాండ్‌)   పోటీ ప‌డుతున్నాయి. జ‌న‌వ‌రి 17వ తేదీన తుది ఆస్కార్ నామినేష‌న్లు ప్ర‌క‌టించ‌నున్నారు.

లాపతా లేడీస్ కు నిరాశ

అయితే బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) మాజీ సతీమణి కిరణ్‌ రావు (Kiran Rao) దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్‌’ (laapataa ladies)కు ఆస్కార్ షార్ట్ లిస్టులో చోటు దక్కకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆస్కార్‌ కోసం ‘లాపతా లేడీస్‌’ టీమ్‌ చాలా కష్టపడింది. హిళా స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం, భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గురించి మాట్లాడగల శక్తి ఉన్న స్టోరీ ఇది అని.. తప్పకుండా ఆస్కార్ గెలుచుకుంటుదని అంతా భావించారు.  కానీ తాజాగా షార్ట్ లిస్టులో చోటు దక్కకపోవడంతో అందరూ నిరాశకు గురయ్యారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *