Allu Arjun Press Meet: కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తారా?

తెలంగాణలో పాలిటిక్స్(Telangana Politics) హాట్‌హాట్‌గా ఉన్నాయి. ఓవైపు అసెంబ్లీలో KTR ఫార్ములా ఈ-కార్ రేసు కేసు(Formula E-Car Race Case) వ్యవహారం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్మరించిందన్న టాపిక్స్‌తో BRS.. KCR పాలనలో అంతా అవినీతే జరిందని అధికార కాంగ్రెస్(Congress) ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ అసెంబ్లీలో CM రేవంత్ టాలీవుడ్‌ ఇండస్ట్రీ(Tollywood industry)పై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పుష్ప2 ప్రీరిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ మరణం, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడానికి కారణం అల్లు అర్జునే కారణమని, సంధ్య థియేటర్(Sandhya Theater Issue) అంశంపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. దీంతో తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ(Congress Govt Vs Tollywood Industry)గా మారింది.

పోలీసులు వెళ్లిపోవాలని కోరినా వినలేదు

అల్లు అర్జున్(Allu Arjun) థియేటర్‌కు రాకూడదని సంధ్య థియేటర్‌కి లిఖితపూర్వకంగా పోలీసులు సమాచారం ఇచ్చినా హీరో వచ్చాడని రావడమే కాదు రోడ్ షో(Road Show) చేస్తూ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు తొక్కిసలాట జరిగినా, తర్వాత సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు వెళ్లిపోవాలని కోరినా సరే వెళ్లకున్న అక్కడే ఉన్నాడని అరెస్ట్ చేస్తానంటే అప్పుడు మాత్రమే బయటకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు వెళ్లే సమయంలో కూడా రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్లీ రోడ్ షో చేస్తూ వెళ్లాడని, ఇలాంటి ఘటనల నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని CM పేర్కొన్నారు.

సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తారా?

ఈనేపథ్యంలో CM రేవంత్ వ్యాఖ్యలపై స్పందించేందుకు అల్లు అర్జున్ కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నట్లుగా అల్లు అర్జున్ టీం(Allu Arjun team) నుంచి సమాచారం అందింది. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? లేక అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి ఈ ఘటన మీద ప్రస్తుతానికి కోర్టు కేసు నడుస్తోంది. కేసు నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ దాని గురించి ప్రస్తావించవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *