Unstoppable With NBK-S4: ఇక అల్లరేఅల్లరి.. వెంకీమామతో బాలయ్య సందడి!

టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్(Unstoppable). ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్(Season 4) జరుగుతుంది. ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్ప‌డిన‌ సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా ఓటీటీ(Aha OTT)లో స్ట్రీమ్ అవుతోన్న ఈ షోపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లే షో టీమ్ కూడా గెస్టులను ఏరికోరి మరి ఇన్వైట్ చేస్తోంది. ఇప్పటికే AP సీఎం చంద్రబాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) అండ్ పుష్ప2 టీమ్, తమిళ స్టార్ సూర్య, దుల్కర్ సల్మాన్, నవీన్ పొలిశెట్టి, బాబీ డియోల్, శ్రీలీల వంటి స్టార్లు ఈ షోకు హాజరై బాలయ్యబాబు(Balayyababu)తో సందడి చేశారు.

వెంకీతో బాలయ్య చేసే సందడి ఎలా ఉంటుందో..

తాజాగా ఈ షో నెక్ట్స్ ఎపిసోడ్‌కి వచ్చే గెస్ట్‌పై మరో క్రేజీ న్యూస్ టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). ఇందుకోసం ఇప్పటికే వెంకిని ఆహా టీమ్ స్పందించిందని సమాచారం. అంతేకాదు ఆదివారం నుంచి షోట్ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకీ.. బాలయ్య ఒక్కచోట చేరి చేసే అల్లరి వేరేలెవల్ ఉండనుందని.. వీరిద్దరికి సంబంధించిచన ఎపిసోడ్(Episode) మరింత ఎంటర్టైన్‌గా సాగుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇక చూడాలి మరి.. వెంకీతో బాలయ్య చేసే సందడి ఎలా ఉండబోతుందో. మరోవైపు వెంకీమామ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

యూట్యూబ్‌ను ఊపేసిన ‘గోదారి గట్టు..’

కాగా ప్రస్తుతం వెంకటేష్-అనిల్ రావిపూడి(Venkatesh-Anil Ravipudi) కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ రానుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘గోదారి గట్టు..’ సాంగ్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. తాజాగా మీనూ.. అనే సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Music Director Bheems Cicerolio) పాడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. కాగాఈ మూవీలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి(Aishwarya Rajesh, Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజ్, సిరీష్ నిర్మిస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *