అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్.. పీఆర్ టీమ్స్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు

Mana Enadu : గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సమయంలో జరిగిన దుర్ఘటనపై దుమారం రేగుతోంది. ఈ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరును యావత్ దేశం గమనిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టయి (Allu Arjun Arrest) బెయిల్ పై విడుదలయ్యారు. అయితే సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు మరింత దుమారం రేగుతోంది.

జాగ్రత్తపడుతున్న టాలీవుడ్

ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పీఆర్ టీమ్ (Allu Arjun PR Team) సరిగ్గా పనిచేయడం లేదంటూ.. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టు ఆయన చదవడం బన్నీకి మైనస్ అయిందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ పీఆర్ టీమ్ వల్లే ఆయనపై మరింత నెగిటివిటీ వస్తోందని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. బన్నీ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో మిగతా టాలీవుడ్ హీరోలు కూడా కాస్త జాగ్రత్త పడుతున్నారు.

పీఆర్ టీమ్ మార్చిన మెగాస్టార్

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమ పీఆర్ టీమ్ లలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన పీఆర్ టీమ్ (Chiranjeevi PR Team) నుంచి నలుగురిని తొలగించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వివాదంలో చిక్కుకుని, రోజుకో చిక్కు తెచ్చిపెట్టుకుంటున్న అల్లు అర్జున్ కూడా తన పీఆర్ టీమ్ మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమను పక్కదారి పట్టేలా కొందరు పీఆర్ లు వ్యవహరిస్తున్నారని భావిస్తున్న హీరోలు తమ టీమ్ లో మార్పులు చేయాలని నిర్ణయించారట.

అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఫెయిల్

ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)నే చూసుకుంటే అల్లు అర్జున్ పీఆర్ టీమ్ వ్యవహరించిన తీరు వల్లే ఇవాళ ఆయన ఈ వివాదంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ప్రముఖులు భావిస్తున్నట్లు తెలిసింది. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో పోలీసులు, అల్లు అర్జున్ మధ్య సమన్వయం చేయకుండా.. తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పీఆర్ టీమ్ నిర్లక్ష్యం పరోక్షంగా ఒకరి ప్రాణం పోవడానికి కారణమైందని టాక్ నడుస్తోంది.

పీఆర్ టీమ్ వల్లే బన్నీకి సమస్య

సాధారణంగా నటులకు ఉండే పీఆర్ టీమ్ వారిని సమాజంలో ఎలా చూపించాలో నిర్ణయిస్తుంది. నటీనటులు ఏం చేసినా.. ఎలా ఉన్నా.. దాన్ని ప్రజలకు ఎలా చూపించాలో.. ప్రజల్లో వారిపై సానుకూలత ఎలా తీసుకురావాలో పీఆర్ టీమ్సే ప్లాన్ చేస్తుంటాయి. వాళ్ల సినిమాలకు హైప్ తీసుకురావాలన్నా.. పబ్లిక్ లో వారి ఇమేజ్ పెరగాలన్నా వీరు వేసే ఎత్తుగడలే ముఖ్యం. ముఖ్యంగా వారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి.. ఎలా ప్రవర్తించాలి.. అనేది పీఆర్ టీమ్ ప్లాన్ చేస్తుంది.

మేల్కొన్న టాలీవుడ్

కానీ అల్లు అర్జున్ విషయంలో ఇలాంటివన్నీ సక్రమంగా ప్లాన్ చేయడంలో ఆయన పీఆర్ టీమ్ పూర్తిగా విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాళ్ల సరిగ్గా పని చేసి.. బన్నీని సక్రమంగా గైడ్ చేసుంటే ఇవాళ ఇలాంటి ఓ దుర్ఘటన జరిగి ఉండేదని కాదని అంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ వివాదం టాలీవుడ్ కు ఓ మేల్కొలుపు లాంటిందని.. ఆయన విషయంలో జరుగుతుంది చూసి చాలా మంది నటులు తమ పీఆర్ టీమ్స్ ను మారుస్తున్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *