పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుదల వల్ల సగటు ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుదల అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా టికెట్ ధరలను నియంత్రిస్తామని తెలిపింది. అయితే లేటెస్ట్ గా ఈ నిర్ణయాన్ని తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ ఆహ్వానించారు. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నట్టుగా ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ విజేందర్ రెడ్డి అలాగే ఆంధ్ర ఎగ్జిబిటర్ల సెక్టార్ చైర్మన్ టి ఎస్ రామ్ ప్రసాద్ అలాగే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ లు ఆల్రెడీ ఈ టికెట్ ధరల విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అని మాట్లాడుకున్నాము అని ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
అన్ని సినిమాలకు టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలో ఉండేలా చూసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజును కోరినట్లు ప్రకటించారు. ఈ విషయంలో సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.






