న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్ కు ప్రభాస్ రిక్వెస్ట్

Mana Enadu : తెలుగు రాష్ట్రాల ప్రజలు 2024కు వీడ్కోలు పలికి 2025 కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరం వేళ వేడుకలకు (New Year 2025) రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు రెబల్ స్టార్ ప్రభాస్ ఓ స్మాల్ రిక్వెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల వేళ ఆయన తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే..?

అవి అవసరమా డార్లింగ్స్

డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas Video) స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. “మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నా తర్వాత కూడా మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. జీవితంలో బోలెడన్నీ ఎంజాయ్​మెంట్స్ ఉన్నాయి. కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అందుకే డ్రగ్స్‌కు నో చెప్పండి డార్లింగ్స్. ఈ న్యూ ఇయర్ ను సంతోషంగా మీ సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేయండి.” అంటూ ప్రభాస్ పిలుపునిచ్చారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 871 267 1111 నెంబరుకు కాల్‌ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

లవ్ యూ డార్లింగ్

ప్రస్తుతం ప్రభాస్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇంత స్వీట్ గా మా డార్లింగ్ (Prabhas New Year Video) చెప్పాక ఎవరైనా తప్పటడుగులు వేస్తారా.. వాట్ సే డార్లింగ్స్.. సే నో టు డ్రగ్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వావ్ డార్లింగ్.. న్యూ ఇయర్ కు వీడియోతో సర్ ప్రైజ్ చేశాడంటూ మరికొందరు హర్షం వ్యక్తం చేశారు. నైస్ డార్లింగ్ అంటూ ఇంకొందరు.. రాజా సాబ్ అప్డేట్ ఏదంటూ మరికొందరు నెట్టింట కామెంట్ బాక్సులో ప్రశ్నల వర్షం కురిపించారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *