గౌతమ్ గంభీర్(Gautham Gambhir).. టీమ్ఇండియా(Team India) క్రికెటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అభిమానుల్లోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. భారత జట్టు 2007లో గెలిచిన T20 ప్రపంచకప్, 2011లో నెగ్గిన ODI వరల్డ్ కప్‌లలో కీలక పాత్ర పోషించాడు. అటు అనేక టెస్టు సిరీస్‌లలో తనదైన స్టైల్లో రాణించి మాజీల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కెప్టెన్, కోచ్‌గానూ ఆ జట్టుకు టైటిల్స్(Titles) అందించాడు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పేసే గంభీర్.. మైదానంలోనూ అంతే దూకుడుగా ఉండేవాడు. ఈ కారణాలతోపాటు అతడి ట్యాలెంట్‌ను చూసి గౌతీని BCCI టీమ్ఇండియా కోచ్‌గా ఎంపిక చేసింది. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది.
నచ్చిన వారిని తీసుకున్నా ప్రభావం లేదు
గంభీర్ కోచింగ్ పగ్గాలు(Coaching reins) అందుకున్నాక టీమ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అటు జట్టు మేనేజ్‌మెంట్‌లోనూ తనకిష్టమైన వారినే గౌతీభాయ్ తీసుకొచ్చాడు. మోర్నీ మోర్కెల్(Mornie Morkel), టెన్ డెస్కటే, అభిషేక్ నాయర్ ఇలా అందరూ గౌతీ సపోర్ట్ ఉన్నవారే. అలాగే టీమ్ ఎంపిక(Team selection)లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు గంభీర్. అయితే ఇక్కడే ఆయనకు అభిమానులు(Fans), మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణమూ లేకపోలేదు. పైగా గంభీర్‌తో జట్టులోని కొందరు ఆటగాళ్లకు పడటం లేదని ఆరోపణలూ ఉన్నాయి.
గంభీర్ సామర్థ్యంపై ప్రశ్నలు
ఎందుకంటే గౌతీ కోచ్‌గా వచ్చాక ప్రస్తుత BGTతో కలిపి 4 సిరీస్‌లు జరిగాయి. ఇందులో భారత్ వన్డే సిరీస్‌ను 2-0తో శ్రీలంక చేతిలో కోల్పోయింది. ఆ తరువాత సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇక ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ టోర్నీలోనూ ఇప్పటికే రెండు టెస్టుల్లో పరాజయంతో సిరీస్ 1-2తో వెనకబడింది. చివరి టెస్ట్‌లో విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే సిరీస్ చేజార్చుకుని టెస్ట్ క్రికెట్లో ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకోనుంది. వాస్తవానికి ఆరు నెలల క్రితం వరకూ క్రికెట్లో టీమ్ఇండియా మంచిస్థానంలో ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ కౌచ్‌గా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి మారింది. ఈనేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ సామర్థ్యంపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇలా అయితే అతడు ఎక్కువ కాలం కోచ్‌గా కొనసాగలేడని ఇప్పటికే పలువురు మాజీలు(Ex Cricketers) అభిప్రాయపడుతున్నారు.








