డొనాల్డ్ ట్రంప్ హోటల్ ముందు పేలుడు

పేలుడుతో అమెరికా మరోసారి ఉలిక్కి పడింది. తాజాగా లాస్ వెగాస్‌లో యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​నకు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అయితే కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు అంటున్నారు.

అది ఉగ్రవాద చర్య

మరోవైపు ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. తాజాగా న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన ఘటనకు ఈ ప్రమాదానికి మధ్య సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రమాదాలకు కారణమైన రెండు కార్లను దుండగులు టూర్‌ రెంటల్ అనే వెబ్‌సైట్‌ నుంచి అద్దెకు తీసుకున్నారని.. బహుశా ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని ఎలాన్ మస్క్​ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

ఎఫ్బీఐ దర్యాప్తు

లాస్ వెగాస్‌లో జరిగిన ప్రమాదం పేలుడు పదార్థాల కారణంగా సంభవించింది. ఈ ప్రమాదానికి కారణం టెస్లా వాహనం కాదు. మా సీనియర్స్ టీమ్ ఈ ఘటనను పరిశీలిస్తోంది. అని మస్క్ తెలిపారు. మరోవైపు ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తెలిపారు.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *