‘బుట్టబొమ్మ బుట్టబొమ్మ.. నన్ను సుట్టీకుంటివీ’, ‘అనగనగనగా అరవిందట తన పేరు’ అంటూ తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik) గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు, ఇన్‌ప్లుయోన్సర్ ఆష్నా ష్రాఫ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నాడు.
2023లో ప్రపోజల్
అర్మాన్ మాలిక్ 2023 ఆగస్టులో ఆష్నా ష్రాఫ్(Aashna Shroff)కు ప్రపోజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట షేర్ చేశాడు. ఇక అదే ఏడాది ఆగష్టులోనే ఈ జంట నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఈ జంట ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ పోస్ట్ కింద (Tu hi mera Ghar) ‘నువ్వు నా ఇల్లు’ అంటూ అర్మాన్ అందమైన క్యాప్షన్ రాసుకొచ్చాడు.
tu hi mera Ghar 🧡 pic.twitter.com/R2gUY2DYIz
— ARMAAN MALIK (@ArmaanMalik22) January 2, 2025
బుట్టబొమ్మతో పాపులారిటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో ‘బుట్ట బొమ్మ (Butta Bomma Song)’ సాంగ్‌తో చాలా ఫేమస్ అయ్యాడు అర్మాన్. అప్పటికే తను హిందీలో ఫేమస్ సింగర్. ఇక ఈ పాటతో మరింత పాపులారిటీ అయ్యాడు. వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అరవింద సమేత వీరరాఘవ ఇలా సూపర్ హిట్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ ట్రాక్స్ పాడి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.







