అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) చందూ మొండేటి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్ (Thandel)’. ఈ మూవీలో చైతూకి జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి(Sai Pallavi) చేస్తోంది. ఈ సినిమాకు బన్నీ వాసు(Bunny vasu) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ మూవీని సంక్రాంతి(Sankranti)కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా.. మూడు భారీ సినిమాలు ఉండటంతో ఫిబ్రవరికి 7వ తేదికి పోస్ట్ పోన్ అయింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే ‘బుజ్జితల్లి’ పాటను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో అలరిస్తోంది. తాజాగా సెకండ్ సాంగ్ ప్రోమో(Second song promo)ను మేకర్స్ రివీల్ చేశారు.
#NamoNamahShivaya 🔱🕉️
#Thandel's Second Single out tomorrow at 5:04 PMHere's the Promo
➡️https://t.co/4G6iroA5UA@Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts pic.twitter.com/KltQASeFzt— chaitanya akkineni (@chay_akkineni) January 3, 2025
చైతూ-సాయి పల్లవి డ్యాన్స్ హైలైట్
‘తండేల్’ చిత్రం నుంచి రెండో సాంగ్ ‘శివ శక్తి’ ప్రోమో (Shiva Shakti Song Promo) విడుదలైంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే సాంగ్ ప్రోమోలో చైతూ-సాయి పల్లవి డ్యాన్స్(Dance) హైలైట్‌గా ఉంది. ‘నమో నమ: శివాయ’ అంటూ సాగే సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందించారు. కాగా, కాశీలో గ్రాండ్‌గా ఈ సాంగ్ లాంచ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా అనివార్యకారణాలతో వాయిదా పడింది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మత్స్యకార కుటుంబాల అంశంతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్టు సమాచారం.






