Thande: తండేల్ నుంచి సూపర్ అప్డేట్.. ‘శివ శక్తి’ సాంగ్ ప్రోమో వచ్చేసింది

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) చందూ మొండేటి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్‌ (Thandel)’. ఈ మూవీలో చైతూకి జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి(Sai Pallavi) చేస్తోంది. ఈ సినిమాకు బన్నీ వాసు(Bunny vasu) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అల్లు అరవింద్‌(Allu Aravind) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ మూవీని సంక్రాంతి(Sankranti)కి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా.. మూడు భారీ సినిమాలు ఉండటంతో ఫిబ్రవరికి 7వ తేదికి పోస్ట్ పోన్ అయింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే ‘బుజ్జితల్లి’ పాటను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో అలరిస్తోంది. తాజాగా సెకండ్ సాంగ్‌ ప్రోమో(Second song promo)ను మేకర్స్ రివీల్ చేశారు.

చైతూ-సాయి పల్లవి డ్యాన్స్ హైలైట్‌

‘తండేల్’ చిత్రం నుంచి రెండో సాంగ్ ‘శివ శక్తి’ ప్రోమో (Shiva Shakti Song Promo) విడుదలైంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే సాంగ్ ప్రోమోలో చైతూ-సాయి పల్లవి డ్యాన్స్(Dance) హైలైట్‌గా ఉంది. ‘నమో నమ: శివాయ’ అంటూ సాగే సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందించారు. కాగా, కాశీలో గ్రాండ్‌గా ఈ సాంగ్ లాంచ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా అనివార్యకారణాలతో వాయిదా పడింది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మత్స్యకార కుటుంబాల అంశంతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్టు సమాచారం.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *