SSMB29 : మహేశ్ బాబు 15 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ వెలికితీసిన ఫ్యాన్స్

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జనవరి 2వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.. కానీ ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తోంది. ఈ కార్యక్రమానికి మీడియాను కూడా అనుమతించకుండా సీక్రెట్ గా సినిమాను ప్రారంభించారు.

ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే

ఈ నెలలోనే పూజా కార్యక్రమం నిర్వహించిన అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం పదిరోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక మార్చి లేదా ఏప్రిల్ లో తదుపరి షెడ్యూల్ వివిధ లోకేషన్లలో షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపైనా జక్కన్న (SS Rajamouli) ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వలేదు. ఎన్నడూ లేని విధంగా మహేశ్ బాబుతో సినిమా విషయంలో రాజమౌళి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ విషయాన్ని కనిపెట్టారు.

15 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్

రాజమౌళితో సినిమా (SSMB29 Update) గురించి మహేశ్ బాబు దాదాపు 15 ఏళ్ల క్రితం చేసిన ఒక ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది. దాదాపు ఏడాది నుంచి తమ హీరో సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. పూజా కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు 15 ఏళ్లు వెనక్కి వెళ్లి 2010, మే 22వ తేదీన మహేశ్ బాబు చేసిన ట్వీట్‌ను వెలికి తీశారు. ఆ ట్వీట్‌లో మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. “మీ అందరికీ గుడ్‌ న్యూస్‌, ఎట్టకేలకు రాజమౌళి, నేను కలిసి సినిమా చేయబోతున్నాం.” అని ట్వీట్ చేశారు.

ఇండస్ట్రీ షేక్ చేసే సినిమాతో

మహేశ్ బాబు ఈ ట్వీట్‌ చేసిన సమయంలో రాజమౌళి మర్యాద రామన్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఈగ, బాహుబలి (Bahubali) మూవీ రెండు పార్టుల కోసం దాదాపు నాలుగేళ్లు, ఆర్ఆర్ఆర్ (RRR)తో మూడేళ్లు తీరిక లేకుండా జక్కన్న ఉండటంతో మహేశ్ తో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత  ఈ కాంబోలో సినిమాకు లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగింది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ మహేశ్ బాబు- రాజమౌళి టాలీవుడ్ ను బ్లాస్ట్ చేసే సినిమాతో రాబోతున్నారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *