Shocking Incident: గర్ల్​ఫ్రెండ్​ని ఇంప్రెస్​ చేసేందుకు సింహాల బోనులోకి.. తర్వాత ఏమైందంటే?

ఓ జూ కీపర్ తన గర్ల్​ఫ్రెండ్​ను ఇంప్రెస్​ చేసేందుకు సాహసం చేసి ఆఖరికి సింహాలకు (lions attack on Zoo keeper) ఆహారమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. గర్ల్​ఫ్రెండ్​ను ఆకట్టుకునేందుకు ఎవరైనా గిఫ్ట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఇంకొందరు సినిమాలు, ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లారు. కానీ, ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan)కు చెందిన ఓ ఓ వ్యక్తి మాత్రం తన ప్రేయసిని ఆకట్టుకునేందుకు పెద్ద సాహసమే చేసి సింహాలకు బలయ్యాడు.

దాడి చేస్తున్నా వీడియో చిత్రీకరణ

ఉజ్బెకిస్థాన్‌ కు చెందిన ఇరిస్కులోవ్‌ (44) అనే వ్యక్తి పార్కెంట్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ జూలో జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. అయితే సింహాల ఎన్​క్లోజర్​లోకి వెళ్లి వాటితో వీడియోలు తీసుకొని గర్ల్​ఫ్రెండ్​ మెప్పు పొందాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే కొద్దిరోజుల క్రితం రాత్రి విధుల్లో ఉండగా.. మూడు సింహాలున్న ఓ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. నిద్రపోయిన సింహాలు అతడిని ఏమీ చేయలేదు. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన ఇరిస్కులోవ్​.. ఒక సింహాన్ని నిశ్శబ్దంగా ఉండూ అని అన్నాడు. అలికిడి విన్న మిగతా సింహాలు అతడిని సమీపించి దాడి చేశాయి. దాడి చేస్తున్న సమయంలోనూ అతడు వీడియో తీయడం గమనార్హం. కొద్దిసేపటికి అతడిని హతమార్చిన సింహాలు ఆ తర్వాత అతడి శరీరాన్ని పాక్షికంగా తినేశాయి.

ఓ సింహాన్ని చంపిన సిబ్బంది

విషయం గమనించిన ఇతర సిబ్బంది రెండు సింహాలను అదుపుచేసి, మరో దాన్ని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మృతుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *