భారత్‌లో 2 HMPV కేసులు.. ఇకనైనా మాస్కులు పెడ్డుకోండి బాసూ

చైనాలో హెచ్‌ఎంపీవీ (HMPV Virus) కలకలం సృష్టిస్తోన్న వేళ ప్రపంచదేశాలు భయంతో వణికిపోతున్నాయి. భారత్‌లోనూ ఆ వైరస్‌ అడుగుపెట్టింది. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసినట్లు ఐసీఎంఆర్ (ICME) వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్‌ సోకినట్లు నిర్ధరాణ అయిందని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అయితే అప్రమత్తతే అసలైన శ్రీరామరక్ష అని పేర్కొంది.

ఆ మార్పుల వల్లే కొత్త వైరస్

చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ (China New Virus HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (JMG) నిర్వహించిన సమావేశంలో.. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు తేల్చారు.

మాస్కు పెట్టుకో గురూ

అయితే భారత్‌లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేఎంజీ తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధ చోట్ల RSA, HMPV తదితర పరీక్షలు చేస్తున్నట్లు తెలిపిన ఆరోగ్య శాఖ .. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని అధికారులు తెలిపారు. మాస్కు (Mask) తప్పకుండా ధరించాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రంగా శానిటైజర్ తో కడుక్కోవాలని తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *