Anjali On Game Changer: నా కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రం ఇదే: అంజలి

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంక‌ర్(Director Shankar) ద‌ర్శక‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, Zee స్టూడియోస్, దిల్ రాజుప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shireesh) అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ అంజలి(Anjali) పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కథ విన్నప్పుడు అమ్మే గుర్తుకొచ్చింది: అంజలి

‘‘గేమ్ ఛేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి(Parvathi). మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. క్యారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre release event)లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ క్యారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌(Career)లో ది బెస్ట్ చిత్రం, క్యారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’’ అని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చారు.

 

ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ట్రైలర్‌తో మరింత పెరిగిపోయాయి. శంకర్-రామ్ చరణ్ కాంబో బ్లాక్ బస్టర్ హిట్(blockbuster hit) కొట్టబోతోందంటూ చెర్రీ, మెగా ఫ్యాన్స్(Mega Fans) అంటున్నారు. ఇక ట్రైలర్ రామ్ చరణ్ (Ram Charan) లుక్స్, ఆయన పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు ఫ్యాన్స్. చెర్రీ(Cherry)ని శంకర్ చూపించిన తీరు, యాక్షన్ సీక్వెన్స్, మేకింగ్ చూసి చెర్రీకి మరో హిట్టు పక్కా అని ఫిక్స్ అయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీ మూడు పాత్రల్లో కనిపిస్తారని ఇటీవల ప్రమోషన్లో భాగంగా నిర్మాత దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *