లేడీ సూపర్ స్టార్ నయనతారకు ‘చంద్రముఖి (chandramukhi)’ సినిమా నిర్మాతలు నోటీసులు పంపారంటూ తాజాగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సదరు నిర్మాణ సంస్థ, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అసలు నయనతార (Nayanthara)కు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని ‘చంద్రముఖి’ సినిమా నిర్మాతలు స్పష్టం చేశారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.
మాకేం అభ్యంతరం లేదు
నయనతార జీవితంపై ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (Nayanthara : Beyond The Fairy Tale) ’ అనే డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పటి నుంచి తరచూ ఓ వివాదం చుట్టుముడుతోంది. తాజాగా ఇందులో ‘చంద్రముఖి’లోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వీటిపై ఆ సినిమా నిర్మాతలు స్పందిస్తూ.. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికెట్ను షేర్ చేశారు.
మేము రూ.5 కోట్లు డిమాండ్ చేయలేదు
‘‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ తెరకెక్కించే ముందే ‘రౌడీ పిక్చర్స్’ సంస్థ మా వద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుంది. డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ లోని సీన్స్ ను ఉపయోగించారు. దీనిపై మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎలాంటి నోటీసులు పంపలేదు. మేము పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వాళ్లు ఆ సన్నివేశాలను వినియోగించారు. దీనిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ‘చంద్రముఖి’ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ ఓ పోస్టు పెట్టింది. తాము రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది.
Putting an end to fake news! #SivajiFilms confirms granting permission for using #Chandramukhi footage in #Nayanthara’s wedding documentary on #Netflix.
Read in detail on: 🔗: https://t.co/ApM2RNa5ws#DTNext #Nayanthara #stopfakenews #Chandramukhi #NetflixIndia #StopFakeNews pic.twitter.com/Z6RBa4AQzP— Bollyflix (@Bollyflixpl) January 7, 2025







