నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది మోక్షజ్ఞ (Mokshagna Teja) పుట్టిన రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఇంతలోనే అది ఆగిపోయింది. అప్పటి నుంచి మోక్షు డెబ్యూ మూవీ గురించి అప్డేట్ లేదు. కానీ ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri)తో మోక్షజ్ఞ రెండో సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఆ సినిమా ఆగిపోలేదు
వెంకీ అట్లూరి- మోక్షజ్ఞ సినిమాకు నిర్మాతగా తానే వ్యవహరించనున్నట్లు నాగవంశీ (Naga Vamsi On Mokshagna Teja Debut) చెప్పారు. అయితే తాజాగా నాగవంశీ మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మతో (Prashant Varma)నే మోక్షు డెబ్యూ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. సుధాకర్ చెరుకూరి గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమాను నిర్మిస్తారని.. ఈ చిత్ర కథను తాను కూడా విన్నానని పేర్కొన్నారు.
Need All Your Blessings ❤️🙏
Look How Is It Guys 👍#Mokshu1 pic.twitter.com/A3lvz1DNlb— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) September 6, 2024
నందమూరి ఫ్యాన్స్ సంబురాలు
నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. తమ అభిమాన హీరో బాలయ్య వారసుడు మోక్షజ్ఞను వెండితెరపై చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమాను చెరుకూరి సుధాకర్ తో పాటు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా హను-మాన్ తరహాలో పీవీసీయూ (PVCU) ఫ్రాంఛైజీలో ఒక భాగమేనని సమాచారం.
#SIMBAisComing to ROAR LOUD @MokshNandamuri 🦁⚡
A @PrasanthVarma Vision ❤️🔥 https://t.co/uWEq9g7xzR
— Prasanth Varma Cinematic Universe (@ThePVCU) November 29, 2024







