హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయం చేయడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరే ముందు నందినగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడానికి మంత్రిగా తాను చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయని తెలిపారు.
అలాంటి పనులు చేయలేదు
“బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మా బావమరుదులకు రూ.1137కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని నేను చేయలేదు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులను నేనివ్వలేదు. అలాంటి తెలివితేటలు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహాచరులకే ఉన్నాయి. నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను. ఏ పనైనా తెలంగాణ కోసమే చేశాను. హైదరాబాద్ ప్రతిష్ఠ పెంచేందుకే చేశాను.” అని కేటీఆర్ అన్నారు.
Live: BRS Working President @KTRBRS addressing the Media at Nandi nagar residence https://t.co/Woa3a27HlV
— BRS Party (@BRSparty) January 9, 2025
అరపైసా అవినీతి చేయలేదు
తాను అరపైసా అవినీతి చేయలేదని.. చేయబోనని కేటీఆర్ (KTR ACB Case) స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము మాట్లాడుతూనే ఉంటామని.. కొట్లాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. లగచర్లలో రైతులను జైల్లో పెట్టినా.. హైడ్రా పేరిట ఇళ్లు కూలగొట్టినా.. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా అడుగడుగునా తాము నిలదీశామని చెప్పారు. కేసులు పెట్టి ఆ అంశాలను పక్కదోవ పట్టిస్తున్నామనుకోవడం రేవంత్‌రెడ్డి వల్ల కాదని.. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. తనపై ఇంకో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై తమకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI
— KTR (@KTRBRS) January 9, 2025







