నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’ మూవీతో సందడి చేయనున్నారు. జనవరి 12వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. బాబీ(Bobby) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్(Bobby Deol) విలన్ రోల్ పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అనంతపురంలో గురువారం జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తిరుపతి దుర్ఘటన(Tirupati Incident) నేపథ్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ఈ సినిమాపై హైప్ పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ప్రేక్షకుల్లో మరింత ఉత్తేజాన్ని నింపేందుకు..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event)లో ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్(New Trailer) విడుదలైంది. ప్రేక్షకుల్లో మరింత ఉత్తేజాన్ని నింపేందుకు రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. బాలయ్య యాక్షన్, BGM, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రం యూనిట్.. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్‌తో మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. కాగా, ఆదివారం నాడు ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ కొత్త ట్రైలర్‌ని చూసేయండి.







