ఎప్పుడూ వేలాది మంది జనంతో హైదరాబాద్(Hyderabad) కిటకిటలాడుతుండేంది. బస్సులు, రైళ్లు, మెట్రో(Metro), మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటి మహానగరం ఖాళీ అయిపోయింది. సంక్రాంతి సెలవుల(Sankranti Holidays)కు నగరవాసులంతా సొంతూళ్ల బాటపట్టారు. వెరసీ గ్రేటర్ హైదరాబాద్‌లోని రోడ్లన్నీ(All roads in Greater Hyderabad) నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం వరకు వాహనాలతో కిక్కిరిసన రోడ్లు ఇవాళ మైదానాలను తలపిస్తున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుల(Outer Ring Road)తోపాటు జాతీయ రహదారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి. దీంతో టోల్ గేట్ల(Toll gates) వద్ద ట్రాఫిక్(Traffic) భారీగా జామైంది.

టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ
భాగ్యనగరంలో స్థిరపడిన ఎంతో మంది సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. దీంతో బస్సులు(Busses), ట్రైన్లు(Trains), విమానాలు, సొంత వాహనాలు.. ఇలా రకరకాల మార్గాల్లో ఇళ్లకు వెళ్తుంటారు. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా(Pantangi Toll Plaza)లో వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతోంది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం టోల్ 18 బూత్‌లు ఉన్నాయి. ఇక ఘట్‌కేసర్ టోల్ ప్లాజా(Ghatkesar Toll Plaza) వద్ద కూడా భారీగా వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి.

విజయవాడ వైపు నిమిషానికి 330 వాహనాలు
మామూలు రోజులలో అయితే నిత్యం 35 వేల నుంచి 45 వేల వాహనాలు వెళ్తాయని సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 55 వేల వాహనాలు వెళ్లినట్లు ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు చెబుతున్నారు. ఆదివార సాయంత్రం వరకూ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగు సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్తుంది, నిమిషానికి 330 వాహనాలు విజయవాడ(Vijayawada) వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విశాల ప్రశాంత ఏకాంత రోడ్లల్లో ….విహరించు హైదరబాదీ ॥#IYKYK #Hyderabad #Sankranthi ♥️ pic.twitter.com/fq01Dptnk0
— Srujana Konakanchi (@srujanak94) January 11, 2025








