సంక్రాంతి(Sankranti) రేసులో ముందుగా ప్లేక్షకులకు ముందుగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొంగల్ కానుకగా రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్-కియారా అద్వానీ(Ram Charan-Kiara Advani) జోడీగా నటించిన ఈ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Director Shankar) తెరకెక్కించారు. అంజలీ, శ్రీకాంత్, SJ సూర్య, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్(Thaman) సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
అభిమానుల ఆగ్రహం
ఈ సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట లేకపోవడంతో అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని టెక్నికల్ కారణాల(Technical reasons) వల్లే ‘నా నా హైరానా’ పాటను యాడ్ చేయలేకపోయారు. అయితే ఇవాళ్టి నుంచి (జనవరి 12) ఈ పాటను నేటి నుంచి ప్రదర్శించనున్నట్లు మేకర్స్(Makers) తెలిపారు. తొలుత జనవరి 14వ తేదీ నుంచి ఈ సాంగ్‌ను అందుబాటులోకి తెస్తామన్న మేకర్స్.. ప్రాబ్లం సాల్వ్ అవడంతో ఈరోజు నుంచే అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుంది. ఈ సినిమా రెండో రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్(Trade reports) చెబుతున్నాయి.
Added #NanaHyrana song from today onwards
GameChanaging experience with #NaanaaHyraanaa #GameChanager pic.twitter.com/ow5N05IWUv— telugu trending buzz (@telugutrenbuzz) January 12, 2025
ఆ సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా
‘గేమ్ ఛేంజర్’.. ఈ సినిమాలో చెర్రీ రామ్ నందన్ అనే IAS, IPS పాత్రలలో నటించాడు. మరోవైపు అప్పన్న(Appanna) పాత్రలోనూ ఒదిగిపోయాడు. ఓ వైపు స్టైలిష్‌గా, మరోవైపు తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ గ్రేస్‌ఫుల్ స్టెప్పులు, చరణ్-SJ సూర్య మధ్య ఉండే పోటా పోటీ సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్-కియారా కెమిస్ట్రీ, అంజలి అద్భుతమైన యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.







